Breaking News
Loading...
Thursday, May 15, 2014

Info Post

నాలుగు సంవత్సరాల నుండి.. ముఖ్యమంత్రి పదవి కోసం కష్టపడుతున్న యంగ్ రాజకీయ నేత ..వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తండ్రి మరణంతోనే ..ఆయన లో బలమైన కోరిక పుట్టింది. తన కలను నిజం చేసుకోవటానికి జగన్ నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాడు. ‘‘మూడు ముద్దులు, ఆరు ఓదార్పు యాత్రలు ’’ అంటూ తెలుగు ప్రజల మద్య తెగ తిరుగుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ పై కత్తి దూసిన ..యంగ్ తెలుగు సింహం అని.. ఆ పార్టీ నాయకులు చాలా గొప్పగా చెప్పుకున్నారు. ‘‘రాజన్న రాజ్యం రావాలంటే.. జగనన్న రావాలి’’ అంటూ , ఆంద్రప్రదేశ్ ను స్వర్ణంద్రప్రదేశ్ గా చేస్తానని ‘‘కరెంట్ లేని ఫ్యాన్ తో ప్రజలకు గాలి విసరటం జగన్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

రాష్ట్ర విభజన జరిగిన వెంటనే.. నేను, నా ఫ్యాన్ సీమాంద్రకే జై అంటూ.. తెలంగాణ లో తిరుగుతున్న ఫ్యాన్ కు జగన్ కరెంట్ కట్ చేయటం జరిగింది. అయితే సీమాంద్ర లో జగన్ ఫ్యాన్ కు చాలా మంది రాజకీయ నాయకులు ఆకర్షితులై, 2014 ఎన్నికల బరిలోకి దిగారు. తెలంగాణలో అతి కొద్ది మంది మాత్రమే.. ఫ్యాన్ ను నమ్ముకున్నారు. వైఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రకటనలు జోరుగా మీడియాలో హల్ చల్ చేశాయి..‘‘ఆయన వస్తున్నాడు’’..ఫ్యాను గుర్తుకు ఓటేయ్యండి? దుమ్ముదులపండి?, మామయ్య వస్తున్నాడు, జగనన్న వస్తున్నాడు, రాజన్న రాజ్యం వస్తుంది. పెద్దాయన వస్తున్నాడు.. అంటూ మీడియా ఎన్నికల ప్రచారం ప్రకటనలకు రక్తి కట్టించారు. చిన్న పిల్లవాడి దగ్గర నుండి, పండు ముసలోడు వరకు ఈ రాజకీయ ప్రకటనల్లో నటించారు.

సీమాంద్రలో ..జగన్ ఫ్యాన్ తిరుగులేకుండా తిరుగుతుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అందరు అనుకున్నారు. కానీ ఇక్కడే పెద్ద పొరపాటు జరిగింది. ‘‘ఏ నిమిషనికి ఏమి జరుగునో’’ ఎవరు చెప్పలేరు. జగన్ అండ్ కో .నేతలు ఆయన వస్తున్నాడు.. మనం గెలుస్తాం అని ఫ్యాన్ గాలి కింద తడిబట్ట వేసుకునే సమయంలో.. తెలుగు ప్రజల కోసం పుట్టిన ‘‘జనసేన పార్టీ’’ తెరపైకి వచ్చింది. ఇలాంటి పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి వాటి గురించి పెద్దగా పట్టంచుకోవాల్సిన పనిలేదని వైసీపీ నేతలకు.. ఆ పార్టీ అధినేత భరోసా ఇవ్వటం జరిగింది. కొంతమంది సీనియర్ నేతలు మాత్రం జగన్ చాలా జాగ్రత్త అని హెచ్చరించారు. కానీ ఆయన వారి మాటలను పట్టించుకోలేదు కదా.. వారిని చిన్న చూపు చూసినట్లు ఆపార్టీలోని సీనియర్ నాయకులు అంటున్నారు.

0 comments:

Pages