విజయవాడ భవానీ ద్వీపంలో శిల్పారామం నిర్మాణం కోసం 20 ఎకరాలను కేటాయించబడింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఇలాంటివి ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని నగరాలలో నిర్మించటానికి ప్రభుత్వం పోయిన సంవత్సరమే నిర్ణయం తీసుకుంది. అప్పటి రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి వట్టి వసంత కుమార్ ఈ విషయంలో మాట్లాడుతూ విజయవాడలోనే కాక అనంతపురం, నెల్లూరు, వరంగల్ లలో కూడా వీటి శాఖలు ఏర్పడనున్నాయని, వీటి కోసం రూ.20 కోట్లు (ఒక్కో స్థలంలో నిర్మాణానికి రూ.5 కోట్ల చొప్పున) నిధులను కూడా కేటాయించిందని తెలియజేసారు. వాటికోసం అవసరమైన భూమిని కూడా వెతికి కేటాయించే బాధ్యతను ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లకు అప్పగించిందని కూడా ఆయన తెలియజేసారు.
ముందుగా విజయవాడ భవానీ ద్వీపంలో 20 ఎకరాల జాగాని కేటాయించటంతో రాష్ట్రంలో ఇంకా ఎన్నో శిల్పారామీలప నిర్మించే పనికి శ్రీకారం చుట్టటం జరిగింది.
0 comments:
Post a Comment