2004 సంవత్సరంలో సునామీ దెబ్బ గురించి దేశం ప్రజలకు బాగా తెలుసు. ఇప్పటికి ఆ సునామీ దెబ్బ ఎవరు మరిచిపోలేదు. మళ్లీ అలాంటి సునామీ దెబ్బ 2014లో కనిపిస్తుంది. అంటే దేశంలో జరుగుతున్న ఎన్నికలు. అయితే ఈ సారి జరిగే ఎన్నికలు .. 2004 లో వచ్చిన సునామీని గుర్తు చేస్తున్నాయి. అవినీతి రాజయకీ నేతలతో అల్లాడిపోతున్న దేశం ప్రజలే, రాజకీయ పార్టీలకు సునామీ దెబ్బ రుచి చూపిస్తున్నారు.
పదేళ్లు పాటు.. అవినీతి పాలన నలిగిపోయిన ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనపై దేశ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆంద్రప్రదేశ్ లోని తెలుగు ప్రజులు. కాంగ్రెస్ కుట్ర రాజకీయలతో.. ఆంద్రప్రదేశ్ ను రెండు విడదీసిన విషయం తెలిసిందే. కలిసిమెలిసి ఉన్న తెలుగు వారిని రెండు ప్రాంతాల ప్రజలుగా విడగొట్టి, వారి మద్య రాజకీయ విద్వేషం నింపి, రాజకీయ ఎన్నికలకు తెరలేపింది.
ఇలాంటి సమయంలో.. కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు, తెలుగు ప్రజల జీవితాలతో, భవిష్యత్తుతో ఆటలాడం మొదలుపెట్టారు. తెలుగు ప్రజలు ఆర్తనాధాలు .. పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ, ‘‘ఒక కంటిలో బెల్లం, మరో కంటిలో సున్నం’’ అన్నట్లు సవతి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో.. తెలుగు ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించిన ఘనత ఒక్క సోనియా గాంధీకే దక్కిందని రాజకీయ మేథావులు అంటున్నారు.
తెలుగు ప్రజలు దిక్కులేని వారిగా.. ఆదుకొని ఆపద్భందువు కోసం ఎదురు చూస్తున్న సమయంలో ‘‘జనం కోసం పుట్టిన ‘‘జనసేనపార్టీ ’’ తెరపైకి వచ్చింది. ఎడారిలో నిలబడిని రెండు ప్రాంతాల ప్రజల కోసం నేనున్నా అంటూ .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు రావటం జరిగింది. దీంతో తెలుగు ప్రజలు ఆనందంతో పొంగిపోయారు. కొంతమంది నోటి దూల నేతలు.. నోరు జారిన విషయం తెలిసిందే.
అయితే అన్నింటికి అణిగిమణిగి ముందుకు పోవటమే ద్వేయంగా పెట్టుకున్నా పవన్ కళ్యాణ్. నోటి దూల నాయకులకు పొలిటికల్ పంచ్ ఇస్తూనే, తెలుగు ప్రజల గుండెల్లో సంపూర్ణ దైర్యం నింపిన ఏకైక వ్యక్తి ఒకే ఒక్క పవన్ కళ్యాణ్ సీనియర్ రాజకీయ మేథావులు అంటున్నారు. ఆయనలోని ఆవేశం, గుండె తెగువ, ప్రతి ఒక్కరికి సాయం చెయ్యలనే తపనే తెలుగు ప్రజలకు బాగా నచ్చింది. కానీ కొన్ని రాజకీయ పార్టీలకు, నేతలకు పవన్ పొలిటికల్ ఎంట్రీ నచ్చలేదనే విషయాన్ని వారు బయటకు చెప్పటం జరిగింది. ఎలాగైన పవన్ పై రాజకీయ బురద చల్లాలి అనే కుట్రతో.. ఆయన వ్యక్తిగత విషయల్లోకి తొంగిచూడటం జరిగింది. కానీ చివరకు వారు సాధించింది ఏమీ లేదని అందరికి అర్థమైంది.
0 comments:
Post a Comment