ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్‌టిసి)ని విజయవంతంగా రెండు ముక్కలు చేసేశారు. గవర్నర్ నరసింహన్ గత కొద్ది రోజులుగా ఆర్టీసిని ఎలా ముక్కలు చేయాలా అని మంతనాలు చేస్తున్నారు. డిస్కస్ చేసీ చేసీ చివరికి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసికి వున్న బస్సుల్లో ఆంధ్రప్రదేశ్‌కి 10,352 బస్సులు ఇస్తారు. తెలంగాణకి 9,064 బస్సులు ఇస్తారు. అలాగే 70,231 మంది ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్‌కి కేటాయిస్తారు. 63,479 ఉద్యోగులను తెలంగాణకు ఇస్తారు. 122 డిపోలు ఆంధ్రప్రదేశ్‌కి, 94 డిపోలు తెలంగాణకు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ఆర్టీసీ జోన్లు ఏర్పాటు చేస్తారు. తెలంగాణలో 3 ఆర్టీసీ జోన్లు ఏర్పాటు చేస్తారు.
0 comments:
Post a Comment