Breaking News
Loading...
Wednesday, May 14, 2014

Info Post


ఎన్నికలు అయిపోగానే ఫలితాలు ఎలా ఉంటాయన్నది తెలుసుకోవటం కోసం టివి ఛానెల్స్ ఇంకా ఇతరులు చేసే ఎగ్జిట్ పోల్ వలన ఎవరికి లాభం కలుగుతుంది అన్నది చూస్తే, మొట్టమొదటిగా కనిపించే లాభం బెట్టింగ్ రాయుళ్ళకే. అసలు ఫలితాలు రావటానికి ముందుగా చేసే అంచనాల వలన ఉర్రూతలూగే రాజకీయరంగంలో ఔత్సాహికులకు ఈ నాలుగు రోజులు మెదడుకి మేత. అందువలన మీడియాకు కూడా లాభమే. ఎన్నికల తర్వాత చేసుకునే పొత్తుల ఒప్పందాలకు ఎగ్జిట్ పోల్స్ సహకరిస్తాయి. అందుకే, ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనుకూలంగా ఉన్న పార్టీలు సంబరాలు చేసుకుంటాయి, ప్రతికూలంగా ఉన్న పార్టీలు అంతా తప్పు, మేమొప్పుకోం అంటూ ప్రకటిస్తాయి. అంతేకాదు, ఆ ప్రకటనల్లో చాలా వరకు డబ్బిచ్చి వేయించుకున్న వార్తలని కూడా ఆరోపిస్తాయి. 

ఇంతవరకు దేశంలో లక్షలకోట్లలో పందేలు జరుగుతున్నాయని అంచనా. అయితే ఇప్పటి వరకు జరుగుతున్న పందేలు ఎగ్జిట్ పోల్ ప్రకటితమవగానే ఇనుమడించి ఎన్నో రెట్లు పెరిగిపోతాయి. దానితో బెట్టింగ్స్ నిర్వహించేవారికి చేతినిండా పని, సంచులనిండా సొమ్ములు.

దేన్నైనా సరిగ్గా ఉపయోగిస్తే ఎప్పుడైనా ప్రయోజనం కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్ కూడా భవిష్యత్తులో అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి చెయి, జాతకం చూపించుకున్నట్లుగానే, పాజిటివ్ తీసుకున్నవాళ్ళకి లాభం ఉంటుంది. అదృష్టం కలిసివస్తుంది అని అంటే ఎలాగూ కలిసివస్తోంది కదా అని బద్ధకంగా ఉండేవాళ్ళు కొందరుంటారు కానీ, దాన్ని పాజిటివ్ గా తీసుకుని కలిసివస్తుంది కాబట్టి శ్రమ వృధా అవదు కదా అని ఇంకా శ్రమించేవారూ ఉంటారు. అదృష్టం కలిసి రాదు అని చెప్తే ఎలాగూ కలిసి రాదు కదా అని నీరసపడేవారుంటారు, కలిసి రాదు కాబట్టి ఇంకా కష్టపడి నష్టాన్ని తగ్గించుకునే ప్రయత్నం చెయ్యాలనుకునేవారూ ఉంటారు.

ఎగ్జిట్ పోల్స్ ని నిజంగా ఉపయోగించుని అనుకూలమైనా, ప్రతికూలమైనా సరే పార్టీని బలోపేతం చేసుకోవటానికి పాటు పడటం పాజిటివ్ గా ముందుకెళ్ళటం అవుతుంది.

ప్రయోజనం దృష్ట్యా కల్పించి రచించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాకుండా నిజంగానే సేకరించిన ఫలితాలు ఎప్పుడూ సరైన ఫలితాల అంచనాలనే చూపిస్తాయి. ఎందుకంటే అలా సేకరించటానికి అనుసరించే విధానంలో వివిధ వయస్సులలో ఉన్నవారు, వివిధ వృత్తి వ్యాపారాలలో ఉన్నవారు, మహిళలు, కొత్తగా వోటు వచ్చినవారు, యువత, పల్లెల్లో పట్నాల్లో నగరాల్లో ఇలా అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలవారినుంచి సేకరించి తయారు చేసిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు అసలు ఫలితాలకు దగ్గరగానేవుంటాయి. అనుసరించిన మార్గం సరిగ్గా లేనప్పుడే వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది.

0 comments:

Pages