Breaking News
Loading...
Thursday, May 15, 2014

Info Post


టాలీవుడ్ లో ‘రాధా’ పై అందురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే కొత్త కొత్త పుకార్లతో ‘రాధా’ పరువు తీస్తున్నారు. దీంతో రాధా ను ఎంత భద్రంగా చూసుకుంటున్న .. దర్శకుడు మారుతికి ఒళ్లు మండిపోయి, మీడిమా ముందు రాధా గుట్టు బయట పెట్టారు.

అయితే, ఈ దర్శకుడు తీసే సినిమాలు కేవలం పెద్దలకి మాత్రమే అనేలా ఉండటంతో, యువత తప్ప మరే అభిమాని తన సినిమాలని చూడటానికి రాని పరిస్థితి కలగటంతో, మారుతి వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రావటం మానేశారు అనే వదంతులు.. కాదు, నిజాలు మాట్లాడుకోవటం మొదలుపెట్టారు.

ఇలాంటి మాటలు దర్శకుడు చెవిన పడటంతో బిపీ పెరిగి, ఎలాగైనా తన సినిమాలతో ఫ్యామిలీ అభిమానులని కూడా సంపాదించుకోవటానికి, తెగ కష్టపడుతూ.. అందుకోసం ఫ్యామిలీ హీరోగా పేరుగాంచిన సీనియర్ పాపులర్ నటుడితో సినిమా చేసేందుకు సిద్దమయ్యాడు. అతను మరెవరో కాదు.. అందరి అభిమాన హీరో విక్టరీ “వెంకటేష్”. మారుతి చెప్పిన కథ నచ్చటంతో, నమ్మకంతో ఆ ప్రాజెక్ట్ ని ఒప్పుకుని, ముహూర్తం కూడా జరుపుకున్నాకా.. ఆ చిత్రం సెట్స్ కి వెళ్ళకుండానే ఆగిపోయింది.

అందుకు అనేక కారణాలు వినిపించిన మారుతి మాత్రం వాటన్నింటిని తోసిపుచ్చాడు. అదే “రాధా”. పేరుకు తగ్గట్టే ఇక ఈ సినిమా రాదేమో అని అందరు అనుకుంటుండగా.. ఈ దర్శకుడు ఇప్పుడు నోరు( రాధా గుట్టు) విప్పాడు. అందరూ అనుకుంటున్నట్టుగా రాధా ఆగిపోలేదు. వెంకటేష్ బాబు “దృశ్యం” సినిమా షెడ్యుల్ లో బిజీగా ఉండటం, నేనేమో “కొత్తజంట” సినిమా బిజీలో ఉండటం వల్ల ఈ చిత్ర విషయంలో కాస్త జాప్యం కలిగింది.

త్వరలోనే రాధా సెట్స్ కి వెళ్తుంది. మారుతి తన వేదనని బయటపెట్టాడు. అయినప్పటికీ, బయట మాత్రం వెంకటేష్ బాబు మారుతీ సినిమా చేసే ఆలోచన లేదనే వాదన ఫిలింనగర్లో బలంగా వినిపిస్తుంది.

0 comments:

Pages