Breaking News
Loading...
Wednesday, May 14, 2014

Info Post
    


టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు .. జీవితం గురించి అందరు గొప్పగా చెప్పుకుంటారు. కానీ మహేష్ బాబు భార్య నమ్రతా మాత్రం అలా చెప్పటం లేదు. నటుడు క్రిష్ణ గారి కోడలుగా, మహేష్ భార్యగా నాకు కష్టాలు తెలుసునని అంటుంది. భగవంతుని దయవల్ల ఇప్పుడు బాగానే ఉన్నాం. కాని ఆ రోజుల్లో మేమేం చాలా కష్టపడ్డం అని నమ్రతా అంటుంది. అంతేకాదు.. మహేష్ బాబు తో ప్రేమలో పడిన తరువాత మూడేళ్లు నరకం చూశామని చెప్పుకొచ్చింది.

మహేష్ కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడని అదే సమయంలో మా పేరెంట్స్, మహేష్ వారి నాయనమ్మ చనిపోవటంతో మాకు కష్టాలు మొదలైయ్యాయి. అప్పుడు ఆయన మూడేళ్లుపాటు ఎలాంటిపని లేకుండా గడిపిన ఆరోజులు ఇప్పటికీ తలచుకుంటే భయానకంగా ఉంటుందని అంటుంది. అయితే ప్రేమించిన వ్యక్తి తోడుంటే ఎలాంటి కష్టమైనా సుఖంగానే ఉంటుందని మహేష్ నిరూపించాడని నమ్రతా ఉద్వేగంగా చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే మా పెళ్లి జరిగి అప్పటికి గౌతమ్-కి 16నెలల వయసు ఉంటుంది. అయితే ఆ సమయంలో చంటిబిడ్డను ఆయనే చూసుకున్నారని తండ్రీకొడుకుల అనుబంధం గురించి నమ్రతా ఆనందంగా చెప్పటం జరిగింది. అంతేకాదు తన భర్తలాంటి వాడు మరెవ్వరూ ఉండరని నమత్రా గొప్పగా చెప్పటం ప్రిన్స్ పై ఆమెకు ఎంత ప్రేమ ఉన్నదో ఇట్టే అర్థమవుతుంది. అంతేకాకుండా ఆయనకు ఇల్లు, సినిమాలు, పిల్లలే లోకమని కొంటెగా చెబుతుంది.

0 comments:

Pages