నందమూరి నటసింహం బాలక్రిష్ణ ఇటీవల నటించిన ‘లెజెండ్ ’ సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఎన్నికల్లో హిందూపురం నుండి పోటీ చేసి ఉత్సాహంగా ప్రచారం నిర్వహించిన ఈ నటసింహం ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ, ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.
ఈ ఫలితాలతో సంబంధం లేకుండా బాలయ్య తన తదుపరి సినిమా కోసం సిద్దం అవుతున్నాడు. ఈయన నూతన దర్శకుడు సత్యదేవ దర్శకత్వంలో రుద్రపాటి రమణారావు నిర్మించబోతున్న సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమాకు టైటిల్ గా ‘గాడ్సే ’ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. భారత దేశ జాతిపిత అయిన గాంధీజీని హత్య చేసిన వ్యక్తి పేరును బాలయ్య తన సినిమా టైటిల్ గా పెట్టుకుంటే ఫ్యాన్స్, తెలుగు సినీ జనాలు ఆదరిస్తారో లేక రాద్దాంతం చేస్తారో చూడాలి.
అన్నట్లు ఈ సినిమా షూటింగు జూన్ 10న ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా అంజలి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలోనే బాలయ్య సినిమాను రిజెక్ట్ చేసిన ఈ సీతమ్మ ఈసారి ఒప్పుకుంటుందో లేదో చూడాలి. ఆమె కాదంటే శ్రేయాను తీసుకునే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.
0 comments:
Post a Comment