Breaking News
Loading...
Wednesday, May 14, 2014

Info Post


తెలంగాణా పోగా మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలలో కెరటంలా వస్తానని అన్న వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కి అడ్డుపడింది ఎవరు? ఆ కెరటం రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా ఎందుకు లేచింది?

గతంలో తన సర్వే నివేదికలతో రాజకీయ రంగంలో విశ్వసనీయతను గడించిన లగడపాటి రాజగోపాల్ తాజాగా 2014 ఎన్నికల ఫలితాల మీద చేసిన సర్వే ఆధారంగా ఇచ్చిన ఫలితాలను బట్టి చూసినా తెలుగు దేశం పార్టీ సీమాంధ్రలో అఖండ విజయాన్ని సాధిస్తోంది.

పరిషత్ ఎన్నికల ఫలితాలను చూసినా తెదేపా ప్రభంజనం కనిపిస్తోందంటే అందుకు కారణమేమిటి? పల్లెల్లో పట్నాలలో కూడా జగన్ కి బ్రహ్మరథం పట్టిన వారు ఒక్కసారిగా ఎలా మారిపోయారు? ఆ మార్పుని తీసుకునివచ్చిందెవరు?



తెదేపా గెలుపుకి దోహదం చేసినవారు ఇద్దరే కనిపిస్తున్నారు. కేంద్రంలో నరేంద్ర మోది హవా, రాష్ట్రంలో విభిన్న రీతిలో రాజకీయ రంగ ప్రవేశం చేసి జనసేన పార్టీని స్థాపించి, మోదీ తెలుగు దేశం పార్టీలకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్!

భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలుగు దేశం పార్టీకి మొదట్లో తన సొంత పార్టీలోను, భాజపా రాష్ట్ర నాయకులతోను విభేదాలు కనిపించాయి. సీట్ల సర్దుబాటులో కూడా భాజపాతో విభేదం వచ్చింది. పైగా జాతీయ స్థాయిలో పనిచేస్తున్న భాజపా ప్రధాని అభ్యర్థి మోదీ ప్రభావం దేశం మొత్తం ఉండటం వలన రాష్ట్రంలో అంత ఎక్కువగా ఉండదు. అందువలన తేదేపా విజయానికి రాష్ట్ర స్థాయిలో పనిచేసిన పవన్ కళ్యాణ్ ప్రభావమే ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ విషయం తెలుసు కనుకనే తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా అభినందించి ఆయనను విందుకు ఆహ్వానించారు.

0 comments:

Pages