అతను 1928లో ఇంగ్లిండ్‌పై టెస్టు కెరీర్‌ను ప్రారంభంచాడు. మొదటి టెస్టులో ఆడిన బ్యాట్‌ను చిన్నారుల ఆసుపత్రికి నిధులు సేకరించేందుకు వీలుగా సిడ్నీ సన్ వార్తా పత్రికకు 1930లో అతను విరాళంగా ఇచ్చాడు. ఆ బ్యాట్ ఒక బాలుడి చేతికి చేరింది.
2008లో అతని కుటుంబ సభ్యులు దానిని అమ్మేశారు. ఆస్ట్రేలియాకే చెందిన ఓ ఔత్సాహికుడు దానిని కొనుగోలు చేశాడు. ఆ బ్యాట్ ఇప్పుడు మళ్లీ వేలానికి వచ్చిందని మెల్బోర్న్‌లోని మోస్‌గ్రీన్ ఆక్షన్స్‌కు చెందిన మాక్స్ విలియమ్‌సన్ ప్రకటించాడు.
కాగా, బ్రాడ్‌మన్ తన మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 18, రెండో ఇన్నింగ్స్‌లో ఒకటి చొప్పున పరుగులు చేశాడు. అయితే అనతికాలంలోనే అతను బ్యాటింగ్‌కు పర్యాయపదంగా మారాడు. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనాథ పిల్లల వైద్యానికి ఉపయోగించాలని నిర్వాహకులు భావిస్తున్నారు.
0 comments:
Post a Comment