Breaking News
Loading...
Wednesday, May 14, 2014

Info Post


ఐపిఎల్ ఏడో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నమెంట్ పాయింట్ల పట్టికలో మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. రాంచీలోని జెఎస్‌సిఎ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 5 వికెట్ల తేడాతో తొలి ఎడిషన్ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు అంకిత్ శర్మ, కెప్టెన్ షేన్ వాట్సన్ 60 పరుగుల భాగస్వామ్యంతో చక్కటి శుభారంభాన్ని అందించారు. ఎనిమిదో ఓవర్‌లో రవిచంద్రన్ అశ్విన్ వేసిన బంతిని ఎదుర్కోబోయి అంకిత్ శర్మ (30) డ్వెన్ స్మిత్‌కు క్యాచ్ ఇవ్వడంతో వీరి భాగస్వామ్యం ముగిసింది.

అతని స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అజింక్యా రహానే (4) స్వల్ప స్కోరుకే రనౌట్‌గా వెనుదిరగ్గా, 36 బంతుల్లో 4 సిక్సర్లు, మరో మూడు ఫోర్ల సహాయంతో 51 పరుగులు సాధించి ఈ సీజన్‌లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన వాట్సన్ 13 ఓవర్‌లో మొహిత్ శర్మ వేసిన బంతిని ఎదుర్కొనే ప్రయత్నంలో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.

ఆ తర్వాత స్టూవర్ట్ బిన్నీ (22) మినహా మిగిలిన వారెవరూ రెండంకెల స్కోర్లు సాధించలేకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు రాబట్టింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో మొహిత్ శర్మ 3 వికెట్లు కైవసం చేసుకోగా, రవీంద్ర జడేజా 2, శామ్యూల్ బద్రీ, రవిచంద్రన్ అశ్విన్ ఒక్కో వికెట్ చొప్పున అందుకున్నారు.

ఆ తర్వాత అశ్విన్ (14)తో కలసి నాలుగో వికెట్‌కు 29 పరుగులు జోడించిన ప్లెసిస్ (38) జేమ్స్ ఫాల్క్‌నర్ బౌలింగ్‌లో నిష్క్రమించగా, చివర్లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (26), రవీంద్ర జడేజా (11) అజేయంగా 28 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.

దీంతో 19.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అధిగమించింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో అంకిత్ శర్మ రెండు వికెట్లు సాధించగా, కెవాన్ కూపర్, రజత్ భాటియా, జేమ్స్ ఫాల్క్‌నర్ ఒక్కో వికెట్ చొప్పున రాబట్టారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 10 మ్యాచ్‌లు ఆడిన సూపర్ కింగ్స్‌కు ఇది ఎనిమిదో విజయం కాగా, రాజస్థాన్ రాయల్స్‌కు నాలుగో ఓటమి. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ .. కింగ్ స్థానంలో నిలబడింది.

-

0 comments:

Pages