గెలుపు తథ్యమని పూర్తిగా విశ్వసిస్తున్న భారతీయ జనతా పార్టీ ఈరోజు సాయంత్రం ప్రభుత్వం ఏర్పాటుకి అవసరమైన నిర్ణయాలను కూడా తీసుకుంటోంది. పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో ఈ విషయంలో చర్చించటానికి అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ సమావేశమౌతున్నారు.
పూర్తి బలంతో ఎన్డియే మే 20 కల్లా ప్రభుత్వాన్ని ఏర్పరచవచ్చని అంచనా వేస్తున్నారు. అందువలన సంబంధిత మంత్రిత్వ శాఖలను కూడా నిర్ణయించే పనిలో పడుతున్నారు. ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకులు ఈ కేటాయింపులను పర్యవేక్షించటం కోసం ఢిల్లీలో మకాం వేసివున్నారు.
విశ్వసనీయమైన వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు అరుణ్ జైట్లీకి ఆర్థిక శాఖ, సుష్మా స్వరాజ్ కి రక్షణ శాఖ, మాజీ ఆర్మీ ఛీఫ్ జనరల్ వికె సింగ్ కి రాష్ట్ర స్థాయిలో రక్షణ శాఖను కేటాయించవచ్చు. రాజ్ నాథ్ సింగ్ హోం మంత్రిత్వ శాఖ, నితిన్ గడ్కరీ రైల్వే శాఖను కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కాని చేపట్టవచ్చు. భాజపా మద్దతుదారైన ఎల్జెపి కి చెందిన రామ్ విలాస్ పాశ్వాన్ కి ఆరోగ్య శాఖ కానీ వ్యవసాయ శాఖకాని ఇవ్వవచ్చు.
అతి సీనియర్ నాయకుడైన లాల్ కిషన్ అద్వానీ విషయంలో కూడా పార్టీ ఆలోచిస్తోంది. ఆయనకు ఎన్డియే ఛైర్మన్ పోస్ట్ ఇవ్వవచ్చు.
ఏమైనా భాజపా సమయాన్ని వృధా చెయ్యదలచుకోలేదని తెలుస్తోంది. అధికారం చేతికి రాగానే చెయ్యదలచుకున్న కార్యక్రమాలను చకచకా చేసేందుకు వ్యూహరచన చేస్తోంది.
0 comments:
Post a Comment